అల్వాల సభ పేరుతో నిరంజన్‌రెడ్డి ఓదార్పు రాజకీయాలు.
ఎమ్మెల్యే మేఘారెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదు
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
పెద్దమందడి,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో బీఆర్ఎస్ నిర్వహించిన 'రైతన్నల రణభేరి' సభ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓదార్పు సభగా మారిందని పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మంగళవారం అల్వాలలోని కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.వనపర్తిలో నిరంజన్‌రెడ్డి గెలుపు కలగానే మిగిలిపోతుందని, 2028 ఎన్నికల్లోనూ ప్రజలు ఆయనను ఆదరించే పరిస్థితి లేదని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. అల్వాలలో ఎండిన పంటలను చూపిస్తూ బీఆర్ఎస్ నాయకులు రైతుల సమస్యల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై విమర్శలు చేయడానికే అల్వాల సభను ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలోనూ పంటలు ఎండిపోలేదా? అని ప్రశ్నించారు. గతంలో రైతులకు వరి సాగు చేయవద్దని సూచించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతుల సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.మంగంపల్లిలో దళిత యువకుడు సుధీర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో హరీశ్‌రావు ఆయన ఇంట్లో మంచినీళ్లు తాగగా, నిరంజన్‌రెడ్డి ఎందుకు తాగలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. దళితుల పట్ల ఆయన వైఖరిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే మేఘారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, బీఆర్ఎస్ నాయకులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే రైతుల సమస్యలను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.ఈ సమావేశంలో ఖిల్లా ఘనపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ టి. రఘుప్రసాద్, వనపర్తి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్తకాపు రామకృష్ణారెడ్డి, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments