జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.

జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.

స్టేషన్‌ ఘన్‌పూర్, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

ఎల్‌నినో ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు డిమాండ్ చేశారు.స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని సీపీఎం మండల కార్యాలయంలో ఆదివారం జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు సకాలంలో కురవక పంటలు సాగు చేయలేక, సాగు చేసిన రైతులు దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లాలో కేవలం నాలుగు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదన్నారు.పత్తికి ఎకరాకు రూ.50 వేలు, వరికి ఎకరాకు రూ.30 వేల చొప్పున ఎలాంటి షరతులు లేకుండా నష్టపరిహారం ఇవ్వాలని, గిట్టుబాటు ధర కల్పించి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు విస్తృతంగా చేపట్టి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.రేషన్ కార్డుదారులకు నెలకు 12 కిలోల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.సమావేశంలో మండల కార్యదర్శి మునిగెల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా చందు నాయక్, తోడెంగల ఐలయ్య, కుర్ర ఉప్పలయ్య, గట్ల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.