ఇల్లంతకుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.
ఇల్లంతకుంటలో ఉక్కు మహిళ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు.
ఇల్లంతకుంట, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనుమల్ల సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకు ఘనంగా అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నాయకులు ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలను, దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఆమె ధైర్యసాహసాలు, పాలనా దక్షత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గూడెపు ఓదెలు, మండలంలోని గ్రామ శాఖ అధ్యక్షులు మూడేళ్ల రమేష్, భోగం సాయిరాం, బండి మల్లయ్య, తోడేటి కిషన్, లక్ష్మాజిపల్లి గ్రామ సర్పంచ్ ముష్కి కుమారస్వామి, ఆర్య రమేష్ రెడ్డి, ధార రమేష్, జక్కు కుమారస్వామి, కీటిక తిరుపతిరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments