రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థిని రితిక ఎంపిక.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థిని రితిక ఎంపిక.

జనగాం,అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు): 

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎడ్ల రితిక రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైంది.గత నెల 23న జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్‌-14 బాలబాలికల ఫుట్‌బాల్ పోటీల్లో రితిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది.ఈ నెల 29, 30, 31 తేదీల్లో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలోని సన్‌ఫ్లవర్స్ వేదిక్ పాఠశాలలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్‌-14 ఫుట్‌బాల్ పోటీల్లో రితిక పాల్గొంటోంది.విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల ప్రిన్సిపల్ పాలకుర్తి శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు మారపాక రాజయ్య, బైరి వెనీల్ కుమార్‌తో పాటు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. రితిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.