రైతులు ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.
పెద్దమందడి ఎంపీడీవో పరిణత.
పెద్దమందడి,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎంపీడీవో పరిణత సూచించారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. గురువారం పెద్దమందడి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీడీవో పరిణత మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి మండల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తమ వంతు సహకారం అందించాలని అన్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పైపులైన్లలో లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని, నీటి వృథాను అరికట్టి ప్రజలకు సక్రమంగా తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


Comments