మూడు మండలాలకే కరువా? మిగతా రైతులపై ఎందుకీ వివక్ష.

మూడు మండలాలకే కరువా? మిగతా రైతులపై ఎందుకీ వివక్ష.

*రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి: తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్.*

కరీంనగర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

ఎల్‌నినో ప్రభావంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కరువు పరిస్థితులను అధికారికంగా గుర్తించి రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పంటలు ఎండిపోయి, పెట్టుబడులు చేతికందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు.

కరీంనగర్ పట్టణం, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ ప్రాంతాలనే కరువు మండలాల జాబితాలో చేర్చి, మిగతా మండలాల రైతులను విస్మరించడం అన్యాయమని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌ నినో ప్రభావం, సాగునీటి ఇబ్బందులు, పంటల నష్టాలతో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కరువు మండలాల ఎంపికలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, పంటల నష్టం, వర్షపాతం, సాగునీటి లభ్యతను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకూ న్యాయమైన పరిహారం అందించాలని, వ్యవసాయ రుణాలు, సాగు ఖర్చులు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతాంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని, రైతుల కష్టాలను విస్మరిస్తే తెలంగాణ రక్షణ సేన రైతుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కరువు పరిస్థితులపై పునఃసమీక్ష చేపట్టి, కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని గుంజపడుగు హరిప్రసాద్ కోరారు.

ఈ సమావేశంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కుతాడి శ్రీనివాస్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బశేట్టి కృష్ణవేణి, జిల్లా పార్టీ నాయకులు శ్రీరాముల రమేష్, మడిపల్లి వినీత్, జంగ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.