ఎండిన పంటలను పరిశీలించేందుకు హరీష్ రావు రాక.
సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్.
పెద్దమందడి,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో నీరందక సుమారు 300 ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి, బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు నవంబర్ 2వ తేదీన అల్వాల గ్రామానికి రానున్నట్లు తెలిపారు.మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు హరీష్ రావు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో చర్చించినట్లు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు.అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించినట్లు చెప్పారు. జగత్పల్లి, మణిగిల్ల, దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, బలిజపల్లి, జంగమాయపల్లి, ముండ్లతండా, చీకరుచెట్టుతండా, చిన్నమండడి గ్రామాల్లో పర్యటించి గ్రామ పెద్దలు, మాజీ మంత్రి అనుచరులతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగత్పల్లి మాజీ వైస్ చైర్మన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి, పానుగంటి సురేష్ కుమార్, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.


Comments