ధర్మసాగర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎఫ్‌పీఓ మహాజన సభ.

ధర్మసాగర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎఫ్‌పీఓ మహాజన సభ.

రైతులకు షేర్ బాండ్ సర్టిఫికెట్ల పంపిణీ.. 

వరి విత్తన శుద్ధి యూనిట్ ఏర్పాటుకు కసరత్తు

ధర్మసాగర్,అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు): 

ధర్మసాగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ) మహాజన సభ నిర్వహించారు.IMG-20261029-WA0027ఈ సందర్భంగా ఎఫ్‌పీఓ సభ్య రైతులకు పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా షేర్ బాండ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీటీసీ ప్రిన్సిపాల్ యాకుబ్ నాయక్ మాట్లాడుతూ, రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) సహకారంతో వరి విత్తన శుద్ధి, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పీఏసీఎస్ పాలకవర్గం, ఎఫ్‌పీఓ సభ్య రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు విజయవంతం కావడానికి రైతులు, పాలకవర్గ సభ్యులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి సహకరించాలని కోరారు.

రైతుల ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాల మెరుగుదలతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించడంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ధర్మసాగర్ నోడల్ ఆఫీసర్ కృష్ణవేణి, ఎఫ్‌పీఓ వ్యాపార నిపుణుడు నరేష్, డీసీసీబీ ధర్మసాగర్ శాఖ మేనేజర్ సౌందర్య, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు యధా కుమారస్వామి పాల్గొన్నారు.
అలాగే పీఏసీఎస్ పాలకవర్గ సభ్యులు బొడ్డు లెనిన్, పోలుమారి విజయ, బిల్లా అమరేందర్ రెడ్డి, బేరే వీరయ్య, మాచర్ల కనకరాజు, మురవత్ బిక్షపతి, మడికంటి రాజయ్య, శామాల రమేష్ రెడ్డి, జంగా వీరయ్య, పీఏసీఎస్ కార్యదర్శి పింగిలి రాజిరెడ్డి, కార్యాలయ సిబ్బంది ఆవుల కుమారస్వామి, బొడ్డు ప్రభుదేవ్, పోలుమారి ప్రవీణ్ కుమార్, కలకోటి మురళీకృష్ణ, జల్తారు మహిరాజు, మామిడాల రాజేందర్, బైరి యాకయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.