41వ డివిజన్ అభివృద్ధికి మేయర్ శ్రీకారం.

41వ డివిజన్ అభివృద్ధికి మేయర్ శ్రీకారం.

*రూ.12 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం.*

*ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.*

కరీంనగర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల్లో భాగంగా శుక్రవారం 41వ డివిజన్‌లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. కట్టరాంపూర్‌లో రూ.12 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

అనంతరం డివిజన్‌లోని వివిధ కాలనీల్లో పాదయాత్ర నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను పరిశీలించారు. ప్రజలు, స్థానిక కార్పొరేటర్ తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ నాంపల్లి రేణుక శ్రీనివాస్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.