పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు.
వేలేరు, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డి ఎల్ ఎస్ ఏ ) ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోక్సో చట్టం, బాల్యవివాహాలు, గంజాయి, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మోటార్ వెహికల్ చట్టంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, ఆపద సమయంలో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్తయ్య, ఎంఈఓ చంద్రమౌళి, జిల్లా న్యాయస్థాన న్యాయవాది కోడూరి.రవి, వేలేరు ఎస్సై నరేష్, ఉపాధ్యయులు తదితరులు పాల్గొన్నారు.


Comments