తిమ్మాపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి.

రైతులకు న్యాయం చేయాలని బీజేపీ ధర్నా.. ఎమ్మార్వోకు వినతిపత్రం.

తిమ్మాపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి.

కరీంనగర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో పంట నష్టాలను ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో తిమ్మాపూర్‌కు చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ, తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆందోళన చేపట్టారు. అనంతరం రైతులకు న్యాయం చేయాలని కోరుతూ తిమ్మాపూర్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

తిమ్మాపూర్ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, అర్హులైన రైతులకు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ సహాయం అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ తిమ్మాపూర్ మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.