పట్టభద్రుల ఓటరు నమోదులో అప్రమత్తంగా ఉండాలి.

పట్టభద్రుల ఓటరు నమోదులో అప్రమత్తంగా ఉండాలి.

బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఓటరు నమోదు ప్రక్రియను జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా చేపట్టాలని మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు.గురువారం స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని జఫర్‌గఢ్ రోడ్డులో ఉన్న కె.ఆర్ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ నాగూర్ల వెంకన్న, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామం, తండాలో పర్యటించి అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ఒక్కో ఇంట్లో నలుగురు, ఐదుగురు గ్రాడ్యుయేట్లు ఉండే అవకాశం ఉందని, దళిత కుటుంబాలతో పాటు తండాల్లోని చదువుకున్న యువతీ యువకులందరినీ గుర్తించాలన్నారు. పార్టీకి అనుకూలంగా ఉన్న పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఇటీవల హనుమకొండలో జరిగిన అఖిలపక్ష సమావేశం తూతూమంత్రంగా సాగిందని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదని విమర్శించారు. కరువు నివారణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.


భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం: ఎర్రబెల్లి దయాకర్ రావు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కీలకంగా భావించి ఓటరు నమోదును బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైందని, తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదే కీలకం: ఏనుగుల రాకేష్ రెడ్డి

పార్టీకి అనుకూలంగా ఉండే పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించడం అత్యంత కీలకమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో చాలా ఓట్లు నమోదు కాకుండా మిగిలిపోయాయని, ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, సీనియర్ నాయకులు ఆకుల కుమార్, చల్లా చందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కనకం గణేష్, కౌన్సిలర్లు రమ్య రఘు రెడ్డి, పొన్న రాజేష్, బూర్ల రాజేశ్వర్, బలగాని అనిల్, తాటికొండ మధు, సర్పంచ్ లు బాలు నాయక్, లక్ష్మణ్, క్రాంతి, యాదగిరి, వార్డు మెంబర్ల మండల అధ్యక్షులు గుండె రంజిత్, నాయకులు మహిపాల్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.IMG-20261029-WA0040

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.