పీఆర్సీని వెంటనే ప్రకటించాలి.

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి.

వేలేరు, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే ప్రకటించి, 40 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రవీందర్ రాజు డిమాండ్ చేశారు. గురువారం వేలేరు మండలంలోని కేజీబీవీ, మల్లికుదుర్ల, కన్నారం ఉన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి 40 నెలలు గడిచినా అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి, ఐదు విడతలుగా పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరారు.
కేజీబీవీ మహిళా ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసేలా ఉన్న జీవో 25ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి. కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శి చుంచుకాల లింగారావు, వేలేరు మండల శాఖ అధ్యక్షుడు డి. భాస్కర్, ప్రధాన కార్యదర్శి కె. పద్మలత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.