పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి.

ప్రేమ్ సాగర్, వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి.

పెద్దమందడి,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):

ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ కోరారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో గ్రామంలోని పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు, ప్రజల హక్కులకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యావంతులు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచనల మేరకు గ్రామంలోని అర్హులైన పట్టభద్రులందరికీ ఓటరు నమోదు విషయంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మద్దూరు స్వాతి నరసింహ, ఉదయ్ సాగర్, ధర్మేందర్, రాజశేఖర్, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.