రైతన్నకు అండగా హరీశ్ రావు పర్యటన.
బీఆర్ఎస్ నాయకుడు శశివర్ధన్ రెడ్డి.
పెద్దమందడి,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు నవంబర్ 2వ తేదీన పర్యటించనున్నారని బలిజపల్లె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శశివర్ధన్ రెడ్డి తెలిపారు.మండలంలోని పలు గ్రామాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఈ పర్యటనలో పాల్గొని, ఎండిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారని తెలిపారు.ఈ పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పంట నష్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా పెద్దమందడి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ మంత్రులు హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిల పర్యటనను విజయవంతం చేయాలని శశివర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.


Comments