దమ్మపేట గురుకుల కళాశాలకు ఏడు కంప్యూటర్లు.

ఎమ్మెల్యే జారె చొరవతో విద్యార్థులకు ఆన్‌లైన్‌ శిక్షణ సదుపాయం.

దమ్మపేట గురుకుల కళాశాలకు ఏడు కంప్యూటర్లు.

దమ్మపేట, అక్టోబరు 29 (తెలంగాణ ముచ్చట్లు): 

పోటీ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా అవసరమైన సాంకేతిక సదుపాయాలను కల్పించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలకు ఇన్ఫోసిస్‌ కంపెనీ తరఫున ఏడు కంప్యూటర్లను ఉచితంగా అందజేశారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్‌ ఈ కంప్యూటర్లను కళాశాల ప్రతినిధులకు అందించారు. కళాశాలలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ) విద్యార్థులకు ఆన్‌లైన్‌ శిక్షణ అందించేందుకు ఈ కంప్యూటర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు నాణ్యమైన శిక్షణ పొందుతూ జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు అవకాశం కలుగుతుంది. విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ బి. సీతారామ్‌, ఎమ్మార్వో మద్దినేని మురళి, మండల అధికారులు, పర్వతనేని ప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.