స్థిరమైన వ్యవసాయం దిశగా అడుగులు.. గోపాలపూర్‌లో సదస్సు.

స్థిరమైన వ్యవసాయం దిశగా అడుగులు.. గోపాలపూర్‌లో సదస్సు.

ఎల్కతుర్తి అక్టోబర్  29 (తెలంగాణ ముచ్చట్లు): 

సాగుభూమి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా గోపాలపూర్ గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయంపై దాని ప్రభావాలు, పంటల మార్పిడి, నీటి పొదుపు, భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో హెచ్చుతగ్గులు సంభవించే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని సాగులో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, పంటల మార్పిడి పద్ధతులను అనుసరించాలని, నేల సారాన్ని కాపాడుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.

రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ నీటి వృథాను అరికట్టాలని, సాగుభూమిని సంరక్షించుకుంటూ స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గోపాలపూర్ గ్రామ సర్పంచ్ కర్రే లక్ష్మి, ఉపసర్పంచ్ మారుపాక సందీప్, వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి పున్నచందర్, విద్యుత్ శాఖ ఏఈ సుధాకర్, పశువైద్యాధికారి డాక్టర్ రాజేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.IMG-20261029-WA0014

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.