ఇల్లందకుంట నూతన ఎంపీడీవోగా రాజీవ్ మల్హోత్రా.

శాలువాతో సత్కరించిన దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు.

ఇల్లందకుంట నూతన ఎంపీడీవోగా రాజీవ్ మల్హోత్రా.

ఇల్లందకుంట, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ మల్హోత్రాను శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇల్లందకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంగిలే రామారావు మాట్లాడుతూ.. ఇల్లందకుంట మండల అభివృద్ధితో పాటు గ్రామాల సమగ్ర పురోగతికి నూతన ఎంపీడీవో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పదవీకాలాన్ని విజయవంతంగా కొనసాగించాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దార సురేష్, దేవస్థానం ధర్మకర్త గొడిశాల పరమేష్, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.