రైతులకు భరోసా ఇచ్చేందుకు హరీశ్‌రావు పర్యటన.

రైతులకు భరోసా ఇచ్చేందుకు హరీశ్‌రావు పర్యటన.

పెద్దమందడి,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో నవంబర్ 2న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటించనున్నట్లు వెల్టూర్ గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లక్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని అల్వాల గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మల్లక్‌ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. పంటలు ఎండిపోయి నష్టాల్లో ఉన్న రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారిలో ఆత్మస్థైర్యం నింపడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చి, వారికి అండగా నిలిచేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని పేర్కొన్నారు.నవంబర్ 2న అల్వాల గ్రామంలో నిర్వహించనున్న పంటల పరిశీలన కార్యక్రమంతో పాటు బహిరంగ సభకు రైతులు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, ఉద్యమకారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మల్లక్‌ సురేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.