జమ్మికుంటలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

, 9, 10, 11 వార్డుల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

జమ్మికుంటలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

జమ్మికుంట, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు): 

పేద ప్రజల ఆత్మగౌరవానికి స్మార్ట్ రేషన్ కార్డులు ప్రతీకగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 8, 9, 10, 11 వార్డులకు చెందిన లబ్ధిదారులకు మోత్కులగూడెంలోని రేషన్ షాపు వద్ద ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు అనుగుణంగా పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గత పదేళ్ల పాలనలో రేషన్ కార్డుల విషయంలో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వివాహమైన కొత్త జంటల పేర్లు, కుటుంబంలో జన్మించిన చిన్నారుల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు. తొమ్మిది రకాల భద్రతా లక్షణాలతో ఆధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు పారదర్శకమైన పంపిణీ వ్యవస్థకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్డులు కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా పేద కుటుంబాల ఆత్మగౌరవానికి, ప్రభుత్వ గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తాయని వివరించారు.

గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని కొందరు వినియోగించుకోలేక ఇతర అవసరాలకు మళ్లించిన పరిస్థితులు ఉండేవని తెలిపారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరా పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల ఆశీస్సులు, మద్దతు ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పొనగంటి విష్ణు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి రవీందర్, జమ్మికుంట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న, కాంగ్రెస్ నాయకులు శీలం అశోక్, రాజ కొమురయ్య, యేబుషి ఓదెలు, ఉడుగుల మల్లయ్య, కట్ట దేవేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.