కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో నవంబర్ 6న బహిరంగ వేలం.
భీమదేవరపల్లి, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో 2027 జాతర సందర్భంగా వివిధ హక్కుల కేటాయింపునకు నవంబర్ 6న టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
వివిధ హక్కులకు నిర్ణయించిన కనీస ధరలు ఇలా ఉన్నాయి. కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయ హక్కుకు రూ.3 లక్షలు, గుమ్మడికాయలు, కోరమీసాల విక్రయ హక్కుకు రూ.3 లక్షలు, ఎండు కొబ్బరి ముక్కలు, బియ్యం, కండువాలు, బట్టలు, చీరల సేకరణ విక్రయ హక్కుకు రూ.2 లక్షలు, పచ్చి కొబ్బరి ముక్కల సేకరణ హక్కుకు రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
పుట్నాలు, ప్యాలాల విక్రయ హక్కుకు రూ.10 వేలు, పార్కింగ్‌కు రూ.50 వేలు, తలనీలాల సేకరణకు రూ.5 వేలు, విద్యుత్ దీపాలంకరణకు రూ.10 వేలు, తడకలు–పందిర్ల ఏర్పాటుకు రూ.10 వేలు, రంగులు–సున్నాలు వేయడానికి రూ.10 వేలు, వంటపాత్రలు–టెంటు సామగ్రి హక్కుకు రూ.10 వేల కనీస ధర నిర్ణయించినట్లు తెలిపారు.
వేలంలో పాల్గొనదలచిన వారు దేవస్థానం నిబంధనలు, షరతులకు అనుగుణంగా నిర్ణీత సమయానికి హాజరుకావాలని ఆలయ అధికారులు సూచించారు.


Comments