పల్లగుట్టలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం.

పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక దృష్టి.

పల్లగుట్టలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం.

చిల్పూర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు): 

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు చర్యలు చేపట్టారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆదేశాల మేరకు చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో మంగళవారం పల్లగుట్ట గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను చేపట్టారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ ఎండీ రఫీ, గ్రామ శాఖ అధ్యక్షుడు ఇసురం శ్రీనివాస్, దేవస్థానం డైరెక్టర్ ఎనగందుల రత్నాకర్ రెడ్డి, మర్రి దుర్గాప్రసాద్, వెంకట్ రెడ్డి, కుంచాల రాజు, లింగన్న, చిల్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసురం కృష్ణ, జనగామ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి మనోజ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.