విద్యార్థుల ప్రగతిని సమీక్షించిన గెజిటెడ్ హెచ్ఎం వరప్రసాదరావు.
పెద్దమ,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల మోజర్ల పాఠశాల సముదాయ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు శుక్రవారం తమ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా చీలికటోనిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు వెల్టూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, హరిజనవాడ పాఠశాలలను సందర్శించారు.పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన ప్రగతి, సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 మార్కుల వివరాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ విధానం అమలు తీరు, సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి పంపించే ప్రక్రియను ఆయన సమీక్షించారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఈ ప్రక్రియ పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఇదే విధమైన పనితీరును విద్యా సంవత్సరం మొత్తం కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల పట్ల ప్రేమ, ఆప్యాయతతో మెలుగుతూ, ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన సాగించాలని తెలిపారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించి, నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు సూచించారు.


Comments