మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. భవిష్యత్తుపై దృష్టి సారించాలి.
ఏకేవీఆర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.
భీమదేవరపల్లి, అక్టోబర్ 30(తెలంగాణ ముచ్చట్లు):
ముల్కనూర్‌లోని ఏకేవీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాజీపేట ఎక్సైజ్ ఎస్‌ఐ సాయిరాం, సురేష్ రెడ్డి హాజరై మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలు, కుటుంబ మరియు సామాజిక జీవితంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బి. శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని భవిష్యత్తు సాధనపై దృష్టి సారించాలని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యంతో పాటు ఆలోచనా శక్తి, విద్యాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అతిథులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


Comments