సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

*విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి*

*- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

 పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.శుక్రవారం జిల్లాలోని ఘన్‌పూర్ (స్టేషన్) మండలం, మీదికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యా బోధన, వంటగది, తరగతి గదులు, గ్రంథాలయం, కంప్యూటర్లు, పాఠశాల పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్... ప్రతిరోజూ సమయానికి పౌష్టికాహారం అందుతుందా? భోజనంతో పాటు గుడ్లు ఇస్తున్నారా? పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు వచ్చాయా? ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయా? క్రీడల్లో శిక్షణ పొందుతున్నారా? అంటూ ఆరా తీశారు.అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు సైన్స్ పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగారు. విద్యార్థులకు సైన్స్ అంశాలను బ్లాక్‌బోర్డుపై వివరంగా రాసి కలెక్టర్ స్వయంగా బోధించారు.ప్రతి సబ్జెక్టును సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించాలని, తరగతిలో బోధించిన పాఠ్యాంశాలను విద్యార్థులతో తిరిగి రాయించడం, చదివించడం ద్వారా నిరంతరం అభ్యాసం చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.పాఠశాల తరగతి గదులు, ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. వంటశాలలో గ్యాస్ పొయ్యి మీద మాత్రమే వంటలు చేయాలని స్పష్టం చేశారు.ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ పరిశీలనలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, పంచాయతీ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.