మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టివేత!

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టివేత!

-పోలీసుల అప్రమత్తతతో ముగ్గురు యువకులు పట్టుబాటు.. 20 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

ఎల్కతుర్తి అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు): 

మత్తు పదార్థాల అక్రమ వినియోగం, విక్రయాలపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ శివారులోని కాకతీయ వాంటేజ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన వాహన తనిఖీల్లో ముగ్గురు యువకులు గంజాయితో పట్టుబడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని విచారించగా, దామెర గ్రామానికి చెందిన రోడ్డబోయిన శ్రీధర్, మట్టెడ జశ్వంత్, పుప్పాల గణేష్‌గా గుర్తించారు.

విచారణలో ముగ్గురూ గత రెండేళ్లుగా గంజాయి సేవిస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో అక్టోబర్ 28న శ్రీధర్ హుజూరాబాద్‌కు వెళ్లి ఆకాష్ అనే వ్యక్తి వద్ద నుంచి 30 గ్రాముల గంజాయిని రూ.1,500కు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి శ్రీధర్, జశ్వంత్ కొంత గంజాయిని సేవించారు.

మిగిలిన గంజాయిని విక్రయించాలనే ఉద్దేశంతో ముగ్గురూ కాకతీయ వాంటేజ్ వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తూఇలాంటి వాటికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.IMG-20261030-WA0020

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.