ఆర్టీఐ పోరాటంతో మహిళా సంఘాల ఖాతాలోకి రూ.1.29 లక్షల రికవరీ.

ఆర్టీఐ యాక్టివిటీ ఫోరం జిల్లా అధ్యక్షుడు మంగరాయి వెంకటేష్.

ఆర్టీఐ పోరాటంతో మహిళా సంఘాల ఖాతాలోకి రూ.1.29 లక్షల రికవరీ.

అడ్డాకుల,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం వర్ని గ్రామ మహిళా సంఘాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం ఫలితంగా రూ.1.29 లక్షలు రికవరీ అయినట్లు ఆర్టీఐ యాక్టివిటీ ఫోరం జిల్లా అధ్యక్షుడు మంగరాయి వెంకటేష్ తెలిపారు. మహిళా సంఘాల నిధుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గ్రామానికి చెందిన యువకులు మంద నవీన్ కుమార్ తదితరులు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించగా, విచారణ అనంతరం రూ.1,29,000లను వర్ని గ్రామ మహిళా సంఘం ఖాతాలో జమ చేయించినట్లు వెల్లడించారు.అయితే ఇంకా సుమారు రూ.3 లక్షల నిధులు రికవరీ కావాల్సి ఉందని, వాటిని కూడా వెంటనే మహిళా సంఘాల ఖాతాలో జమ చేయించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన గ్రామ సంఘ సహాయకురాలిపై (వీఓఏ) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.అదేవిధంగా నిజాయితీగా విధులు నిర్వహించిన కమ్యూనిటీ కోఆర్డినేటర్ యాదగిరి బదిలీ వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సొమ్ముకు పూర్తి రక్షణ కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మంగరాయి వెంకటేష్ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.