ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి*

**దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు*

*-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్*

స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

 రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర అందించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్ పర్సన్ నీల రాజమ్మ పిలుపునిచ్చారు.స్టేషన్ ఘన్ పూర్ పట్టణంలోని ఘనపూర్, శివునిపల్లి ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు సౌదరపల్లి సంపత్ రాజు, గుర్రం హరినాథ్, గుర్రం హైమ రమేష్, పట్టణ అధికార ప్రతినిధి పోశాల కృష్ణ, మెప్మా టీఎంసీ శ్యామ్ బాబు, రీసోర్స్ పర్సన్లు చిరంజీవి, వసంత, భాగ్య, మౌనిక, గీత, రమ్య, నందిని, సమాఖ్య సంఘం కమిటీ సభ్యులు పి. నాగరాణి, అరుణ, పి. రామలీల, కే. స్వరూప, ఎస్. మమత, సూర్య సమాఖ్య సంఘం కమిటీ సభ్యులు రాధిక, అనిత, లలిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.