ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి.. బీజేపీలోకి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు .

మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు.

ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి.. బీజేపీలోకి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు .

ఎల్కతుర్తి అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామేరా గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కందికొండ కోటిలింగం, పాండ్రాల సదానందం భారతీయ జనతా పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.

మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంతో దామేరా గ్రామంలో బీజేపీ కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అల్లికుమార్, చిదురల వెంకటేష్, ఉపాధ్యక్షుడు అంబ్బీర్ శ్రీనివాస్, దామేరా శక్తి కేంద్ర ఇన్‌చార్జి ఠాకూర్ శాంసింగ్, సాతూరి ప్రభాకర్, చల్ల రవీందర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మంతుర్తి సమ్మయ్య, పాండ్రాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.IMG-20261029-WA0017

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.