పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించిన ఆల్ఫోర్స్ విద్యార్థులు.

క్షేత్ర పర్యటనతో వ్యవసాయం, పట్టు పరిశ్రమపై అవగాహన.

పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించిన ఆల్ఫోర్స్ విద్యార్థులు.

హుజురాబాద్,అక్టోబర్ 30(తెలంగాణ ముచ్చట్లు ):

విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు విజ్ఞాన పర్యటనలు ఎంతగానో దోహదపడతాయని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.
హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాల విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా తుమ్మనపల్లి గ్రామంలోని పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టు పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిపై అవగాహన పెంపొందించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు పరిశీలనా శక్తి, జిజ్ఞాస, ఆచరణాత్మక నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. ప్రకృతి, వ్యవసాయం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి విజ్ఞాన పర్యటనలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పర్యటనలో భాగంగా విద్యార్థులు మల్బరీ సాగు, పట్టుపురుగుల జీవన చక్రం, గుడ్ల నుంచి పురుగులుగా ఎదిగే దశలు, పట్టుపురుగులు గూళ్లు అల్లే విధానం, వాటి నుంచి పట్టుదారాన్ని సేకరించే ప్రక్రియను ఆసక్తిగా తెలుసుకున్నారు. పట్టు ఉత్పత్తిలో రైతులు అనుసరించే పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పట్టు పరిశ్రమలో రైతుల IMG-20261030-WA0014పాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయ రైతు బొక్కల వేణుగోపాల్ విద్యార్థులకు పట్టుపురుగుల పెంపకంలోని వివిధ దశలను క్షేత్రస్థాయిలో వివరించారు. పట్టుపురుగుల పెంపకానికి అనుకూలమైన వాతావరణం, వాటికి అందించే ఆహారం, సంరక్షణ పద్ధతులు, గూళ్ల తయారీ నుంచి పట్టుదారం ఉత్పత్తి వరకు జరిగే ప్రక్రియలను తెలియజేశారు. వ్యవసాయ అనుబంధ రంగమైన సెరికల్చర్ ద్వారా రైతులకు లభించే ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పట్టు పరిశ్రమ ప్రాధాన్యతను వివరించారు.
విద్యార్థులు పట్టుపురుగుల పెంపకం కేంద్రంలోని వివిధ దశలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పుస్తకాల్లో చదివిన అంశాలను స్వయంగా చూసి తెలుసుకోవడం ద్వారా వ్యవసాయం, పట్టు పరిశ్రమపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందారు. రైతులు పడే శ్రమను, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.