రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
కాజీపేట్ అక్టోబర్ 30 ( తెలంగాణ ముచ్చట్లు)
పట్టభద్రులైన రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు తప్పకుండా నమోదు చేసుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇన్చార్జి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. బిఆర్ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లోని పలు కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇన్చార్జి వినోద్ కుమార్ జంక్షన్ లోని పలు కార్యాలయంలో తిరుగుతూ స్టేషన్ మాస్టర్ అగ్గి రవీందర్ లతోపాటు టి టి లకు, బుకింగ్ క్లర్క్ లతోపాటు అర్హత కలిగిన ఇతర ఉద్యోగులకు ఎమ్మెల్సీ ఓటర్ నమోదు పత్రాలను అందజేసి వారు తప్పకుండా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఫిబ్రవరి మార్చి నెలలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టపద్రుల నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జరగనున్నట్లు ఆయన తెలిపారు. పట్టబద్రులు ఎమ్మెల్సీ ఓట్లను చాలామంది నమోదు చేసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్ నమోదు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నవంబర్ 6న ముగుస్తుందనీ అర్హత కలిగిన ప్రతి ఒక్క పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసు దేవరెడ్డి, ప్రొఫెసర్ దినేష్ మాజీ కార్పొరేటర్లు దాస్యం విజయభాస్కర్, జోరిక రమేష్, సంకు నర్సింగరావు, నాయకులు నార్లగిరి రమేష్, సుంచు కృష్ణ, పాలడుగుల శివకుమార్, దువ్వ కనకరాజు, బెదర కొండ రంజిత్, తేలు సారంగపాణి, బసవ యాదగిరి , మర్యాల కృష్ణ, అఫ్జల్, హుస్సేన్, పోలపల్లి రామ్మూర్తి, సుంచు అశోక్, నయీమ్ జుబేర్, కుమ్మరి రాజ్ కుమార్, తండమల్ల వేణు, మహమూద్, వినయ్, బండి రామచందర్, శంకర్, దువ్వ నరేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.


Comments