జాతీయ సాహస శిబిరానికి జమ్మికుంట విద్యార్థిని ఎంపిక.

జాతీయ సాహస శిబిరానికి జమ్మికుంట విద్యార్థిని ఎంపిక.

* ధర్మశాలలో పది రోజుల పాటు జరిగే శిబిరంలో పాల్గొననున్న అనిత.. 

* అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు

జమ్మికుంట, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ స్థాయి సాహస శిబిరానికి జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఎన్. అనిత ఎంపికై కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో నవంబర్ 18 నుంచి 27 వరకు పది రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సాహస శిబిరంలో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం లభించింది.

కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 19న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు జాతీయ సాహస శిబిరం ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఎన్. అనిత జాతీయ శిబిరానికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రమేష్ తెలిపారు. విద్యార్థిని జాతీయ స్థాయి శిబిరానికి ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని, ఆమె సాధించిన విజయంతో తోటి విద్యార్థుల్లో స్ఫూర్తి నిండుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాలలో అనితను ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లోనూ ప్రతిభను చాటుతూ ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అధ్యాపకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రం, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ గణేష్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎంబాడి రవి, లోఖండే రవీందర్, అధ్యాపకులు డాక్టర్ శ్యామల, కిరణ్ కుమార్, డాక్టర్ మాధవి, ఉమాకిరణ్, డాక్టర్ రాజకుమార్, పి. శ్రీనివాస్ రెడ్డి, మమత, డాక్టర్ సుష్మ, డాక్టర్ రవిప్రకాశ్, డాక్టర్ శ్రీనివాస్, పి. అరుణ్ రాజ్, సాయికుమార్, శ్రీకాంత్, దీనా, డాక్టర్ వినీత కుమారి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.IMG-20261030-WA0025

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.