మల్కాపూర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ముమ్మరం.

ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు.

మల్కాపూర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ముమ్మరం.

చిల్పూర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు): 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆదేశాల మేరకు చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో గురువారం మల్కాపూర్ గ్రామంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గ్రామంలోని పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించారు. ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులు అవసరమైన పత్రాలను అందజేస్తే, ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎడవెల్లి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు జంగం రవి, డైరెక్టర్ యశ్వంత్ రెడ్డి, వార్డు సభ్యులు హరీష్, రాకేష్, కుమారస్వామి, రాణి, నాదం, కుమార్, రవి, మదిరెడ్డి మోహన్ రెడ్డి, పొన్న రాజయ్య, వెంకట్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.