దళిత ఉపసర్పంచ్‌కు వేధింపుల ఆరోపణలు!

దళిత ఉపసర్పంచ్‌కు వేధింపుల ఆరోపణలు!

రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు

సర్పంచ్‌ కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌..

పోలీసులకు ఫిర్యాదు

IMG-20261029-WA0037 

కోహీర్‌,అక్టోబర్‌ 29 (తెలంగాణ ముచ్చట్లు): 

సజ్జాపూర్‌ గ్రామ పంచాయతీకి చెందిన దళిత ఉపసర్పంచ్‌ మైసయ్యను పదవికి రాజీనామా చేయాలంటూ సర్పంచ్‌ కే. పద్మావతి కుమారుడు ప్రసాద్‌రెడ్డి ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారని మైసయ్య, కోహీర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ సంపత్‌కుమార్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ ఆరోపణలు చేశారు.మైసయ్య మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ప్రసాద్‌రెడ్డి తనను బహిరంగంగా దూషిస్తూ, అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉపసర్పంచ్‌ పదవికి వెంటనే రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని, గ్రామసభలకు సంబంధించి తనకున్న హక్కులను సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తన కుటుంబం భయాందోళనలకు గురవుతోందని, తనకు న్యాయం చేయడంతోపాటు రక్షణ కల్పించాలని ఆయన, ఆయన తల్లి శ్యామలమ్మ కోరారు.

అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

దళిత ప్రజాప్రతినిధిపై వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కులం పేరుతో దూషించినట్లు వచ్చిన ఆరోపణలను పరిశీలించి, విచారణలో వాస్తవాలు తేలితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ), డీఎల్‌పీఓ, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌ స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే దళిత సంఘాలు, మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

అనంతరం ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోహీర్‌ పోలీసులకు, జహీరాబాద్‌ డీఎస్పీ కార్యాలయంలో లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో దళిత నాయకులు ముర్జల్‌, అలెగ్జాండర్‌, గాబ్రియేల్‌, రవికిరణ్‌, మున్నా, వినోద్‌, అవినాష్‌, శివకుమార్‌, సురేష్‌, మోజస్‌, మోహన్‌దాస్‌, కృష్ణ, పద్మారావు, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.