రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి.

భార్య, రెండేళ్ల కుమార్తెను వదిలి వెళ్లడంతో కుటుంబంలో విషాదం.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి.

వేలేరు, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామ శివారులో ఈ నెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పీచర గ్రామానికి చెందిన మాతంగి రాజేష్ (33) చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. వరంగల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, మల్లికుదుర్ల శివారులోని చెరువు వద్ద ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో రాజేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
మొదట వరంగల్‌లో చికిత్స పొందిన రాజేష్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. రాజేష్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఘనపూర్, శివునిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలి* **దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు* *-చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్* స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):...
స్నేహానికి సెల్యూట్.
ఘన్‌పూర్ పిఎస్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్.
మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
సర్కారు బడిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
రైల్వే ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలి .
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో.