ప్రజాసేవలో చెరగని ముద్ర.. జక్కుల సువార్తకు ఘన సన్మానం.
*అదనపు కమిషనర్ పదవీ విరమణ సందర్భంగా కళాభారతిలో సత్కారం.*
*జక్కుల సువార్త సేవలను కొనియాడిన యాదగిరి సునీల్ రావు.*
కరీంనగర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన జక్కుల సువార్తకు కళాభారతిలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై జక్కుల సువార్తను శాలువాతో సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. జక్కుల సువార్త తన సుదీర్ఘ సేవా కాలంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి, నగర ప్రజలకు మధ్య బలమైన వారధిగా నిలిచి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. తన వద్దకు వచ్చిన ప్రతి ప్రజా సమస్యను బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు ఆమె విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
గత రెండేళ్లలో నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు, పరిపాలనా వ్యవహారాల్లో ఆమె అందించిన సేవలు అభినందనీయమన్నారు. మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు వివిధ విభాగాల మధ్య సమన్వయం సాధించడంలో కీలక పాత్ర పోషించి అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు పొందారని తెలిపారు.


Comments