గ్రంథాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలు.
*దేశ ఐక్యతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం*
*ముఖ్య అధితులుగా బీసీ జేఏసీ నాయకులు*
హుజురాబాద్,అక్టోబర్(తెలంగాణ ముచ్చట్లు ):
పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ కృషీవలుడు తిరునగరి రమేష్, గ్రంథాలయ అధికారిణి విప్ప పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని, దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలు భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పటేల్, అప్పట్లో వివిధ సంస్థానాలుగా విడిపోయి ఉన్న భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానంతో సహా సుమారు 560 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో తన ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించారని అన్నారు. అందుకే ఆయనను భారత ఉక్కుమనిషిగా దేశ ప్రజలు గౌరవిస్తారని పేర్కొన్నారు.


Comments