వైభవంగా వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
పాల్గొన్న చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కిరణ్మయి దంపతులు!
చిల్పూర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
జనగాం జిల్లా చిల్పూర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి వార కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో వివిధ గ్రామాల నుండి, పట్టణాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు - కిరణ్మయి దంపతులు, ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఈవో శ్రీమతి బి. లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు కళ్యాణాన్ని నిర్వహించగా, ఆలయ సిబ్బంది సహకరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.ఈ కార్యక్రమంతో చిల్పూర్ గుట్ట మొత్తం భక్తి భావంతో, పండుగ వాతావరణంతో నిండిపోయింది.


Comments