బోధనలోనే కాదు... సేవలోను ముందే!
*స్కూల్ కు కంప్యూటర్, ప్రింటర్ అందించిన టీచర్*
*సోషల్ టీచర్ పై ఎంఈఓ ప్రశంసలు*
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చే ఘటన శివునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల సోషల్ టీచర్ కె. రజని తన సొంత ఖర్చుతో రూ. 40,000 విలువైన కంప్యూటర్, ప్రింటర్ ను పాఠశాలకు దానం చేశారు.విద్యార్థులకు డిజిటల్ విద్య అందించాలనే గొప్ప సంకల్పంతో ఆమె ఈ దానం చేయడం పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ కంప్యూటర్, ప్రింటర్ తో విద్యార్థులకు కంప్యూటర్ విద్యతో పాటు పరీక్ష పేపర్లు, నోట్స్ ప్రింట్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కె. రమేష్ పాల్గొని టీచర్ రజనిని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి దాతలు, ఉపాధ్యాయులు ఉండటం వల్లనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని ఆయన అన్నారు.టీచర్ రజని చేసిన ఈ దానం ఇతర ఉపాధ్యాయులకు, దాతలకు ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. ప్రవీణ్ కుమార్, శ్రీనికాంత్, లక్ష్మీ ప్రసాద్, ఈ. రమేష్, కృష్ణవేణి, అరుణ, శ్రీదేవి, సురేఖ, జి. రవి, రాధాకృష్ణ, టి. శ్రీనాథ్, నళిని బాయి తదితరులు పాల్గొన్నారు.


Comments