నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర.

నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర.

*కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం..*

*మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం: యాదగిరి సునీల్ రావు*

కరీంనగర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. ఈ మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల విధానాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టే లక్ష్యంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 5న కార్ఖానగడ్డ గాంధీ చౌరస్తా నుంచి టవర్ మీదుగా కమాన్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర మహా పాదయాత్ర కొనసాగనుంది.

ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశంతో కలిసి యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పాదయాత్ర నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. బండి సంజయ్ నాయకత్వంలో కరీంనగర్ గడ్డపై నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పార్టీ పట్ల కార్యకర్తలకు ఉన్న అభిమానం, నాయకత్వంపై నమ్మకం, జిల్లా శ్రేణుల సమష్టి కృషితో కరీంనగర్‌లో చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ప్రజల మద్దతు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియపై కృత్రిమ ఆందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించారని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయని, గత పన్నెండున్నర సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావులేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు సైతం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాయని తెలిపారు.

మహా పాదయాత్రలో మహిళా మోర్చా నాయకులు, మహిళా కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలను సమీకరించి పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి నవంబర్ 5న జరిగే మహా పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, అన్నపూర్ణ, మాజీ జెడ్పీ చైర్మన్ కన్నమల్ల విజయ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గుజ్జ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, కనమల్ల గణపతి, మహిళా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర. నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర.
*కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం..* *మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం: యాదగిరి సునీల్ రావు* కరీంనగర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ...
ఓటరు జాబితా సవరణ నిలిపివేయాలి.. 
వైభవంగా వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
బోధనలోనే కాదు... సేవలోను ముందే!
హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇందిరా గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం.
ఇల్లంతకుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.