విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.

 *రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి*

*ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే*

*రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై ఆరా.. అన్ని వార్డుల్లో సౌకర్యాల పరిశీలన*

హుజురాబాద్,అక్టోబర్ 31(తెలంగాణ ముచ్చట్లు ):

ప్రజలకు వైద్య సేవలు అందించే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న అధికారులు, వైద్యులు, సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యాధికారులు పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించకుండా, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శనివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆకస్మికంగా సందర్శించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రికి చేరుకున్న ఆమె ముందుగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను, అన్ని వార్డులను పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్యుల స్పందన, మందుల లభ్యత, ఇతర సౌకర్యాల గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలను సేకరించారు.IMG-20261031-WA0084

Tags:

Post Your Comments

Comments

Latest News

నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర. నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర.
*కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం..* *మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం: యాదగిరి సునీల్ రావు* కరీంనగర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ...
ఓటరు జాబితా సవరణ నిలిపివేయాలి.. 
వైభవంగా వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
బోధనలోనే కాదు... సేవలోను ముందే!
హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇందిరా గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం.
ఇల్లంతకుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.