గ్రామస్థాయిలో విద్యార్థి చైతన్యం.. ఎంఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక.
ఎల్కతుర్తి, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామస్థాయిలో విద్యార్థులను సంఘటితం చేస్తూ, వారిలో సామాజిక చైతన్యం పెంపొందించడంతో పాటు విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలు, జిల్లా నాయకత్వం సూచనల మేరకు ఎల్కతుర్తి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అడ్డూరి అనిల్ మాదిగ, మండల కార్యదర్శి చిలుముల వినోద్ మాదిగ, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు గొల్లమందల చరణ్ మాదిగ ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యా అవకాశాల సాధన, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఎంఎస్ఎఫ్ వేదికగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో విద్యార్థులను సంఘటితం చేసి విద్యా చైతన్యాన్ని విస్తరించడమే నూతన కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
గ్రామ అధ్యక్షుడిగా బొంకూరి దేవ మాదిగ, ఉపాధ్యక్షుడిగా అడ్డూరి సుశాంత్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా చుంచు శ్రీశాంత్ మాదిగ, కార్యదర్శిగా బొంకూరి హర్షవర్ధన్ మాదిగ, కోశాధికారిగా బొంకూరి సాయి రితిక్ మాదిగలను ఎన్నుకున్నారు.
కమిటీ సభ్యులుగా బొంకూరి బాలు మాదిగ, చుంచు ప్రభుతేజ మాదిగ, బొంకూరి అంజి మాదిగ, చుంచు సాహిత్ మాదిగ, చిలుముల సంజయ్ మాదిగ, బొంకూరి వివేక్ మాదిగ, బొంకూరి వికాస్ మాదిగ తదితరులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అడ్డూరి నవీన్ మాదిగ, చిలుముల ప్రమోద్ మాదిగ, బొంకూరి అనిల్ మాదిగ, అడ్డూరి సుధాకర్ మాదిగ, అల్లకొండ మహేష్ మాదిగ, బొంకూరి చందు మాదిగ, బొంకూరి తేజ మాదిగ, బొంకూరి ఉదయ్ మాదిగతో పాటు పలువురు మాదిగ విద్యార్థులు పాల్గొన్నారు.
నూతన కమిటీ విద్యార్థుల ఐక్యతకు కేంద్రంగా నిలుస్తూ, గ్రామంలో విద్యా చైతన్యాన్ని విస్తరించి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.


Comments