హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

పెద్దమందడి,అక్టోబర్31(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం  అల్వాల గ్రామంలో నవంబర్ 2న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొననున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. సభ నిర్వహించనున్న ప్రాంగణాన్ని సందర్శించి, సభా ఏర్పాట్లపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వానాకాలం సాగులో నీరు, విద్యుత్ కొరత కారణంగా పెద్దమందడి మండల పరిధిలోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ముందుచూపు, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నీటి లభ్యత ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో పంటలకు నీరు అందించలేకపోయారని విమర్శించారు.నవంబర్ 2న హరీష్ రావు అల్వాల గ్రామానికి చేరుకుని ఎండిపోయిన వరి పంటలను స్వయంగా పరిశీలించడంతో పాటు బాధిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని రైతులకు భరోసా కల్పిస్తారని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేస్తారని పేర్కొన్నారు.సభకు వేలాది మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, నీడ తదితర సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.నిరంజన్ రెడ్డి వెంట జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, అల్వాల గ్రామ సర్పంచ్ రాజ మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేణు యాదవ్, నాయకులు అల్వాల వెంకట్ రెడ్డి, సయ్యద్ జమీల్, సేనాపతి, బాల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, గౌడ్ నాయక్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర. నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర.
*కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం..* *మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం: యాదగిరి సునీల్ రావు* కరీంనగర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ...
ఓటరు జాబితా సవరణ నిలిపివేయాలి.. 
వైభవంగా వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
బోధనలోనే కాదు... సేవలోను ముందే!
హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇందిరా గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం.
ఇల్లంతకుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.