ఓటరు జాబితా సవరణ నిలిపివేయాలి.. 

ఓటరు జాబితా సవరణ నిలిపివేయాలి.. 

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి!

ఘనపూర్‌లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన


స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

ఓటు హక్కును పరిరక్షించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం స్టేషన్ ఘన్‌పూర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాఖ్య మాజీ నాయకులు ఎం.డి. రహ్మతుల్లాహ్, జిల్లా అధ్యక్షుడు పస్తం పృథ్విరాజ్ మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా కొనసాగుతోందని విమర్శించారు.
ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయనే కారణంతో లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, 2002 నాటి పాత రికార్డులు, ఇంటి పేర్లలో అక్షర దోషాలను సాకుగా చూపుతూ నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపించారు. తాతలు, ముత్తాతల కాలం నాటి పత్రాలను అడగడం ద్వారా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సమాఖ్య జిల్లా నాయకులు పస్తం జీవం, రాము, కిరణ్, రాజు, సన్నీతో పాటు పలువురు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర. నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర.
*కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం..* *మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం: యాదగిరి సునీల్ రావు* కరీంనగర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ...
ఓటరు జాబితా సవరణ నిలిపివేయాలి.. 
వైభవంగా వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
బోధనలోనే కాదు... సేవలోను ముందే!
హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇందిరా గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం.
ఇల్లంతకుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.