ఎల్కతుర్తిలో బీజేపీ దూకుడు.. నాలుగు గ్రామాల్లో కమిటీల ఏర్పాటు.

మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.

ఎల్కతుర్తిలో బీజేపీ దూకుడు.. నాలుగు గ్రామాల్లో కమిటీల ఏర్పాటు.

ఎల్కతుర్తి అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేశవపూర్, ఇంద్రనగర్, దండేపల్లి, ఎల్కతుర్తి గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు కార్యక్రమాలను నిర్వహించింది. IMG-20261031-WA0078

మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పలు బూత్‌లకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు, ఎల్కతుర్తి గ్రామంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.

ఎల్కతుర్తి గ్రామంలో 314వ బూత్ అధ్యక్షుడిగా గోడిశాల రాజు, 315వ బూత్ అధ్యక్షుడిగా అల్లి కిరణ్, 316వ బూత్ అధ్యక్షుడిగా గూడెల్లి దశరథం ఎన్నికయ్యారు. అదేవిధంగా అల్లి సురేష్, అల్లి కిరణ్, దశరథం, దూడ రమేష్, కందుకూరి శ్రీనివాస్, కడారి లింగయ్య తదితరులు బీజేపీలో చేరారు. వీరికి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

దండేపల్లి గ్రామంలో నాలుగు బూత్‌లకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 289వ బూత్ అధ్యక్షుడిగా మాచర్ల వెంకటేష్, 290వ బూత్ అధ్యక్షుడిగా పనుగంటి లక్ష్మారెడ్డి, 291వ బూత్ అధ్యక్షుడిగా కడారి సంపత్ రావు, 292వ బూత్ అధ్యక్షుడిగా కాటుకూరి కార్తీక్ ఎన్నికయ్యారు.

ఇంద్రనగర్ గ్రామంలో తొలిసారిగా బీజేపీ బూత్ కమిటీని ఏర్పాటు చేశారు. 319వ బూత్ అధ్యక్షుడిగా నమిండ్ల ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశవపూర్ గ్రామంలో 320వ బూత్ అధ్యక్షుడిగా ఈర కుమారస్వామి, 321వ బూత్ అధ్యక్షుడిగా పుట్ట కనకయ్య, 322వ బూత్ అధ్యక్షుడిగా గన్నోజు రాకేష్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బూత్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో బూత్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, అంకితభావంతో సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి బూత్‌ను పటిష్టమైన శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శులు అల్లి కుమార్, చిదురల వెంకటేష్, సీనియర్ నాయకులు జనగాని కిష్టయ్య, నాంపల్లి అశోక్, పెరుగు మధు, కొమ్మిడి విజయేందర్ రెడ్డి, నమిండ్ల ప్రవీణ్, శక్తి కేంద్రం ఇన్‌చార్జ్ మాచర్ల తిరుపతి, మండల కార్యదర్శి చీర్ర శ్రీనివాస్, నరేడ్ల శంకర్, మాచర్ల శంకర్, మండల ఉపాధ్యక్షులు కడారి ప్రసాద్, వేల్పుల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పోలు నరేష్, మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎర్రగొల్ల శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ పోలు శివసేన, జెల్ల రాజు, పోలు రాజు, అఖిల్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర. నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర.
*కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం..* *మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం: యాదగిరి సునీల్ రావు* కరీంనగర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ...
ఓటరు జాబితా సవరణ నిలిపివేయాలి.. 
వైభవంగా వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
బోధనలోనే కాదు... సేవలోను ముందే!
హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇందిరా గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం.
ఇల్లంతకుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.