జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పరుగు పోటీలు.
ఐక్యతా స్ఫూర్తిని చాటిన విద్యార్థులు.. విజేతలకు షీల్డుల ప్రదానం.
Views: 0
On
హుజురాబాద్, అక్టోబర్ 31(తెలంగాణ ముచ్చట్లు ):
జాతీయ సమైక్యత దినోత్సవం, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని హుజురాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం హుజురాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు పరుగు పోటీలు నిర్వహించారు.
దేశ ఐక్యత, సమైక్యత భావనను విద్యార్థుల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీల్లో బాలురు, బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన సాకేత్, మనోజ్ కుమార్, సింధు, అమూల్యలకు ట్రస్ట్ నిర్వాహకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి చేతుల మీదుగా షీల్డులను అందజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
31 Oct 2026 19:45:00
*కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం..*
*మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం: యాదగిరి సునీల్ రావు*
కరీంనగర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ...


Comments