బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు.. చట్టంపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన.

జమ్మికుంటలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006పై అవగాహన సదస్సు.

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు.. చట్టంపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన.

జమ్మికుంట, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు): 

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాలకు పాల్పడినా, వాటికి సహకరించినా చట్టపరమైన చర్యలు తప్పవని వక్తలు స్పష్టం చేశారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం జమ్మికుంట, వావిలాల సెక్టార్ల సమావేశంలో భాగంగా సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఆర్‌డీ) ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు బాల్య వివాహాల నిరోధక చట్టం–2006పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐసీడీఎస్ జమ్మికుంట, వావిలాల సెక్టార్ సూపర్‌వైజర్లు రమాదేవి, పద్మ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలబాలికల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. చిన్న వయసులో వివాహాలు జరగడం వల్ల శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టడంలో అంగన్వాడీ టీచర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఎస్‌ఆర్‌డీ కరీంనగర్ కమ్యూనిటీ సోషల్ ఆర్గనైజర్ గాజంగి వీరాస్వామి (వీరన్న) మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండని బాలికకు, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేయడం నేరమని వివరించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. బాల్య వివాహాలకు ప్రోత్సహించిన, సహకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు రమాదేవి, పద్మ, ఎస్‌ఆర్‌డీ కమ్యూనిటీ సోషల్ ఆర్గనైజర్ గాజంగి వీరాస్వామి (వీరన్న), జమ్మికుంట మండల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర. నవంబర్ 5న కరీంనగర్‌లో బండి సంజయ్ మహా పాదయాత్ర.
*కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడదాం..* *మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం: యాదగిరి సునీల్ రావు* కరీంనగర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ...
ఓటరు జాబితా సవరణ నిలిపివేయాలి.. 
వైభవంగా వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
బోధనలోనే కాదు... సేవలోను ముందే!
హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇందిరా గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం.
ఇల్లంతకుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.