ఎట్టకేలకు లైన్ క్లియర్ - పట్టణానికి మహర్దశ!

ఎట్టకేలకు లైన్ క్లియర్ - పట్టణానికి మహర్దశ!
మున్సిపల్ చైర్మన్, తాటికొండ వినయ్ కుమార్

*ఘన్‌పూర్‌లో 60 అడుగుల మెగా రోడ్డు!*

*ఎమ్మెల్యే చొరవతో రోడ్డు విస్తరణకు మోక్షం*

*గాంధీ బొమ్మ నుండి బస్టాండ్ వరకు సెంట్రల్ లైటింగ్‌తో కొత్త రూపు!*

*ట్రాఫిక్ రద్దీకి చెక్ - పట్టణ అభివృద్ధిలో కీలక అడుగు!*

స్టేషన్ ఘన్‌పూర్, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు): 

ఎన్నో ఏళ్లుగా స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న రోడ్డు విస్తరణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఇరుకైన రోడ్డు, నిత్యం ట్రాఫిక్ జామ్, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజల అవస్థలు... ఇక అన్నింటికీ తెరపడనుంది.గాంధీ బొమ్మ నుండి బస్టాండ్ వరకు గల ప్రతాప్ టెంట్ హౌస్, పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి, అభివృద్ధికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకొని రూ. 2 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయించారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 30 అడుగుల చొప్పున మొత్తం 60 అడుగుల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం శనివారం అధికారులు మార్కింగ్ కూడా పూర్తి చేశారు. త్వరలోనే అడ్డుగా ఉన్న ప్రహరీ గోడలు, ఇళ్లు, మెట్లను తొలగించి పనులు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా ఈ విస్తరణ జరగనుంది.ఈ పనులు పూర్తయితే పట్టణ అభివృద్ధిలో కీలక అడుగు పడినట్లేనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ అధికారులు సైతం కోరుతున్నారు.

మున్సిపల్ చైర్మన్ : తాటికొండ వినయ్ కుమార్:*

 "పట్టణ అభివృద్ధి అంటే ఇదే. కేవలం రోడ్డు వేయడం కాదు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా 60 అడుగుల రోడ్డు వేస్తున్నారు. ఇది ఘన్‌పూర్‌కు ఎంతో అవసరం. వ్యాపారులు, వాహనదారులు కొంత ఇబ్బంది పడినా, భవిష్యత్తు కోసం అందరూ సహకరించాలి. పనులు నాణ్యతగా, త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం." "మున్సిపాలిటీ అభివృద్ధే మా లక్ష్యం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి  సహకారంతో ఈ మెగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నాం. మార్కింగ్ పూర్తి చేశాము, త్వరలోనే అడ్డంకులు తొలగించి పనులు ప్రారంభిస్తాం. సెంట్రల్ లైటింగ్‌తో పాటు ఈ రోడ్డును పట్టణానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ప్రజలు సహకరిస్తే పనులు వేగంగా పూర్తవుతాయి

IMG-20261101-WA0022
గట్టు ప్రశాంత్, తిరుమలనాథ స్వామి దేవస్థానం డైరెక్టర్

 

గట్టు ప్రశాంత్, తిరుమలనాథ దేవస్థానం డైరెక్టర్*

 "గతంలో ఉన్న నాయకులు అభివృద్ధిపై ఏనాడూ దృష్టి పెట్టలేదు. ఈ రోడ్డు విస్తరణ కోసం కనీసం ఆలోచించలేదు. ఇరుకైన రోడ్డు వల్ల ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి చొరవ వల్లే ఈ రోడ్డుకు మోక్షం లభించింది. 60 అడుగుల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వస్తే ఘన్‌పూర్ రూపురేఖలే మారిపోతాయి. ప్రజలందరూ సహకరించి ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి."

*పొన్నం స్వరూప - రాజయ్య,17 వ వార్డు  కౌన్సిలర్:*

IMG-20261101-WA0021
పొన్నం స్వరూప, 17వ వార్డు కౌన్సిలర్

 "బస్టాండ్‌కు, ఆసుపత్రికి, ఎమ్మార్వో ఆఫీస్‌కు వచ్చే వారికి ఇది ప్రధాన రహదారి. ఇప్పుడు విస్తరణ జరుగుతుండటం ఎంతో సంతోషంగా ఉంది. సెంట్రల్ లైటింగ్ వస్తే రాత్రి వేళల్లో కూడా సురక్షితంగా ఉంటుంది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు."
ఇరుకైన ఈ రహదారి విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించిందని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వల్లే ఇది సాధ్యమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు? ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు?
* జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి * జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ శాంతియుత నిరసన జమ్మికుంట, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు): దేశ...
రాజవరంలో విషాదం.
నాగేంద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.
విద్య, క్రీడలు, సామాజిక చైతన్యానికి లయన్స్ క్లబ్ చేయూత.
నాగేంద్రమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
పట్టభద్రుల ఓటు నమోదు గడువు మరో 10 రోజులు పొడిగించాలి.