నాగేంద్రమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.

నాగేంద్రమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.

పెద్దమందడి,నవంబర్01(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్ తల్లి నాగేంద్రమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు గ్రామ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్పంచ్ అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిని కోల్పోవడం ఏ కుటుంబానికైనా తీరని లోటని, ఆ బాధను భరించే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. నాగేంద్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అశోక్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డితో పాటు గ్రామ నాయకులు చింతల వెంకటేశ్వర్లు, దిండు రవీందర్, డీలర్ శ్రీనివాసులు, మిల్లర్ రాజు, కుమ్మరి కొండన్న, కావలి వెంకటయ్య, కావలి తిరుపతయ్య, శివ, బొడ్డప్ప, తదితరులు పాల్గొని నాగేంద్రమ్మకు నివాళులర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు? ఓటు హక్కును కాపాడలేని సీఈసీ ఎందుకు?
* జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి * జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ శాంతియుత నిరసన జమ్మికుంట, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు): దేశ...
రాజవరంలో విషాదం.
నాగేంద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.
విద్య, క్రీడలు, సామాజిక చైతన్యానికి లయన్స్ క్లబ్ చేయూత.
నాగేంద్రమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
పట్టభద్రుల ఓటు నమోదు గడువు మరో 10 రోజులు పొడిగించాలి.