నాగేంద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
పెద్దమందడి,నవంబర్01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్ తల్లి నాగేంద్రమ్మ దశదిన కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్పంచ్ అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాగేంద్రమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, తల్లి మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆప్తులను కోల్పోయిన సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి మనోధైర్యం కల్పిస్తూ అండగా నిలవాలని అన్నారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ దశదిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొని నాగేంద్రమ్మకు నివాళులర్పించారు.


Comments